పెద్ద పండగ పెద్ద పండగ
పెద్ద పండగ పేరు దండగ
పండుగెవరికి? పండుగెవరికి?
పండుగెవరికి? పబ్బమెవరికి?
తిండిలేకా , దిక్కులేక
దేవులాడే దీనజనులకు
పండుగెక్కడ? పబ్బమెక్కడ?
ఎండుడెక్కల పుండురెక్కల
బండబ్రతుకుల బానిసేండ్రకు
పండుగేమిటి ? పబ్బమేమిటి?
ఉండడానికి గూడులేకా
పండడానికి నీడలేకా
ఎండవానలో దేబిరించే
హీనజనులుకు,పేదనరులుకు
పండుగొకటా? పబ్బమొకటా?
పెద్ద పండగ పెద్ద పండగ
పెద్ద పండగ, శుద్ధదండగ
.....రచన .. శ్రీ శ్రీ
ఎప్పటి శ్రీ శ్రీ కవిత్వం...ఇప్పటికీ.. పేద బ్రతుకుల రాత చెక్కు చెదరలేదు.
మూలం: ' ఈనాడు ' దినపత్రిక, తేది - 07-జనవరి-2007
Sunday, January 7, 2007
చెక్కు చెదరని రాత
Posted by Satish at 9:38 AM
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.
Post a Comment